NTV Telugu Site icon

Rashmika Mandanna: రష్మికను చూసి ముఖం తిప్పుకున్న ప్రభాస్ హీరోయిన్..

Sraddha

Sraddha

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తా చాటుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది. ఇక రష్మిక ఎక్కడ ఉంటే అక్కడ అటెన్షన్ ఉంటుంది. స్టార్ హీరోయిన్లను కూడా పక్కనపెట్టి ఫోటోగ్రాఫర్లు రష్మిక మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. తాజాగా రష్మికను చూసి ఒక బాలీవుడ్ భామ ముఖం తిప్పుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ బాలీవుడ్ భామ ఎవరో కాదు.. శ్రద్ధా కపూర్. సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా. మొదటి సినిమాని ప్రభాస్ సరసన నటించిన అవకాశం అందుకోవడంతో ఈ భామకు తెలుగులో తిరుగులేదు అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయేసరికి ముద్దుగుమ్మ మరోసారి తెలుగు వైపు చూసింది లేదు. ఇక తాజాగా అంబానీ కుటుంబం వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల అందరికీ అంబానీ కుటుంబం ఆహ్వానం పంపింది. అందులో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఉండడం విశేషం.

Tiger Nageswara Rao: అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు

ఇక ఆ ఈవెంట్లో రష్మిక చక్కగా చీరకట్టులో మెరిసి అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఆమె ఈవెంట్లో అడుగుపెట్టగానే కెమెరాలు పట్టుకొని ఫోటోగ్రాఫర్లు రష్మికాజీ.. రష్మికాజీ అంటూ ఆమెను ఫోటోలు తీస్తూ కనబడ్డారు. ఇక అదే సమయంలో తెలుపు రంగు చుడిదార్ వేసుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని శ్రద్ధ కపూర్ అటు నుంచి వచ్చింది. ఇక శ్రద్ధ రావడాన్ని గమనించిన రష్మిక ఆమెను పలకరించడానికి ఒక సెకండ్ ఆగింది. అయితే శ్రద్ధ మాత్రం రష్మికను ఏమాత్రం పట్టించుకోకుండా ముఖం తిప్పుకొని పక్కనుంచి వెళ్ళిపోయింది. అది చూసి మొదటి రష్మిక కూడా షాక్ అయింది. కానీ, చుట్టూ కెమెరాలు ఉండడంతో ఆమె మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి ఫోటోలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రద్ధ కావాలనే రష్మికను అవైడ్ చేసిందా..? లేదా ఆమెకు ఫోటోగ్రాఫర్లు ఇస్తున్న అటెన్షన్ చూసి జెలసీ ఫీల్ అయిందా.. ? లేక రష్మిక రేంజ్ ను చూసి భయపడిందా..? అనేది శ్రద్ధకు మాత్రమే తెలియాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ శ్రద్ధపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ వారికి నెపోకిడ్స్ మాత్రమే సరైన వారని చెప్పుకొస్తున్నారు.