బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఖిలాడీగా అభిమానులతో పిలిపించుకునే అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో ఖాన్స్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకునే రేంజ్ హిట్స్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్, మినిమమ్ గ్యారెంటీ హీరో అనే దగ్గర నుంచి ఖాన్స్ ని పర్ఫెక్ట్ పోటీ అనిపించుకున్నాడు. కమర్షియల్, కామెడీ, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్… ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల పరంగానే కాదు సామాజిక బాధ్యత పరంగా కూడా ప్రతి ఏడాది అత్యధిక టాక్స్ పేయర్ గా అక్షయ్ కుమార్ నిలుస్తాడు. అభిమానులు వద్దు అన్నారు అని కోట్లు తెచ్చే గుట్కా పాన్ మసాలా అడ్వార్టైజ్మెంట్ లని కూడా కాదన్నాడు. ఇలాంటి వ్యక్తిని పట్టుకోని యాంటీ ఫ్యాన్స్ కెనడా కుమార్ అంటూ విమర్శలు చేస్తారు. ఒక సినిమా ప్లాప్ అయినా, సాలిడ్ హిట్ కొట్టినా యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో కెనడా కుమార్ అంటూ అక్షయ్ కుమార్ ఐడెంటిటీని టార్గెట్ చేస్తుంటారు.
కెనడా సిటిజెన్షిప్ ఉన్న అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి ముప్పై ఏళ్లు అయ్యింది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అక్షయ్ కుమార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు చేశాడు. హైయెస్ట్ టాక్స్ పే చేస్తున్నాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ‘కెనడా కుమార్’ అనడం కరెక్ట్ కాదంటూ చాలా మంది అక్కినీ సపోర్ట్ చేస్తుంటారు కానీ విమర్శలు మాత్రం ఆగలేదు. ‘కెనడా కుమార్’ అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అక్షయ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇకపై ఈ విమర్శలు వినిపించే అవకాశం లేదు, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే రోజునే అక్షయ్ కుమార్ కి ఇండియన్ సిటిజెన్షిప్ వచ్చేసింది. దీంతో “దిల్ ఔర్ సిటిజెన్షిప్… దోనో హిందూస్థానీ” అంటూ అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ విషయంలో అక్కి ఫ్యాన్స్ చాలా హ్యాపీ మరి ఇకనైనా ‘కెనడా స్టార్’ అనే కామెంట్ ఆగిపోతుందేమో చూడాలి.
Dil aur citizenship, dono Hindustani.
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk— Jolly Mishra – Asli Jolly from Kanpur (@akshaykumar) August 15, 2023