Site icon NTV Telugu

Tollywood : ఒకప్పటి బాలీవుడ్ హీరోస్.. ఇప్పుడు టాలీవుడ్ విలన్స్

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్‌లో ఫేడవుటయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఎటైమ్ అమ్మాయిల డ్రీమ్‌ బాయ్స్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీడియోల్, సైఫ్ అలీఖాన్.. ఇప్పుడు టీటౌన్ విలన్స్ గా ఛేంజ్ అయ్యారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌లో కనిపించిన సంజయ్ దత్‌ను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

Also Read : Ajith Kumar : గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో.. బాబీడియోల్‌కు విలన్ రోల్ ఇచ్చి అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ మూవీలో ఒక్క డైలాగ్ లేకపోయినా తన నటనతో రణబీర్ కపూర్‌కే టఫ్ ఫైట్ ఇచ్చాడు బాబీ.  ప్రజెంట్ అతడి ఆఫర్లు చూసి ఖంగుతినడం ఖాయం. ఇక తెలుగులో ఢాకూ మహారాజ్‌తో ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్, హరి హర వీరమల్లు చేస్తున్నాడు. మరిన్ని లైన్లో ఉన్నాయి.  బాబీడియోల్ కన్నా ముందే బాలయ్యతో ఢీకొట్టిన బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్. భగవంత్ కేసరిలో నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ ఆదిపురుష్, దేవరలో పాన్ ఇండియా స్టార్లతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇప్పుడు వీరి జాబితాలోకి ఎంటర్ అవుతున్నాడు అక్షయ్ ఖన్నా. రీసెంట్లీ ఛావాలో ఔరంగ జేబ్ పాత్రలో మెస్మరైజ్ చేసిన అక్షయ్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగంగా తొలి ఫీమేల్ సూపర్ ఉమెన్ ఫిల్మ్ మహాకాళిలో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడని బాలీవుడ్ బజ్. పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకురాలు. ఒకటి మాత్రం నిజం ఒకప్పుడు టీటౌన్ అంటే పట్టించుకోని హీరోలంతా ఇప్పుడు గొప్పగా చర్చించే స్థాయికి ఎదిగింది టాలీవుడ్.

Exit mobile version