కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది మైత్రీ మూవీస్. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ ను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపిస్తున్నాడు. తెలుగు టీజర్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. తెలుగు డబ్బింగ్ ను పర్ఫెక్ట్ కుదిరింది. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాగా వస్తోంది గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ కుమార్ ఎప్పటిలాగే ఈజ్ తో తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. అజిత్ సరసన త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ అందించిన నేపధ్య సంగీతం సూవ్ర్బ్ అనే చెప్పాలి. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మాస్ ఆడీయన్స్ కు ఫీస్ట్ అందించేలా ఉంది. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న విడుదలవుతున్న ఈ చిత్రం వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిచింది.