Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోలు భారీ హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. బాలీవుడ్ నుంచి బలమైన సినిమాలు రాలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దున్నేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ అట్లీతో మూవీ చేసి భారీ హిట్ అందుకున్నాడు. మొన్ననే సన్నీడియోల్ కూడా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మూవీ చేసి హిట్ అందుకున్నాడు.
Read Also : Samantha : సమంత టాలీవుడ్ లో ఇక కనిపించదా..?
రణ్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ చేసి భారీ హిట్ ఇచ్చాడు. ఇలా సౌత్ డైరెక్టర్లు మంచి హిట్స్ ఇస్తుండటంతో బాలీవుడ్ హీరోలు సౌత్ వైపు చూస్తున్నారు. మంచి హిట్ డైరెక్టర్లను పట్టేసి మూవీలు చేస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ కూడా లోకేష్ కనగరాజ్ తో మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. సల్మాన్ ఖాన్ కూడా తెలుగు డైరెక్టర్ తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అంటూ మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. హృతిక్ రోషన్ కూడా సౌత్ డైరెక్టర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.
ఇలా బాలీవుడ్ హీరోలు అందరూ సౌత్ డైరెక్టర్ల వైపే చూస్తున్నారు. పైగా సౌత్ డైరెక్టర్లు వారికి హిట్లు ఇస్తున్నారు. అదే వారిని సౌత్ వైపు చూసేలా చేస్తోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ గొప్ప అన్న వాళ్లే.. ఇప్పుడు సౌత్ జోష్ చూసి ఇక్కడి వారితో మూవీలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాను రాను ఇదే ట్రెండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Deepika Padukone : దీపిక నాతో రెండేళ్లు డేటింగ్ చేసింది.. నటుడి షాకింగ్ కామెంట్స్..