Site icon NTV Telugu

థర్డ్ వేవ్ కంటే ఎక్కువే అనుభవిస్తున్నాం… : సోనూసూద్

Sonu Sood purchase a new property in Hyderabad

కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే మంచి పనుల్లో సోనూసూద్ కు కూడా భాగస్వామ్యం ఇస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి చేపట్టిన “దేశ్ కే మెంటర్” అనే మంచి కార్యక్రమానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ ను చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పే సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటాడు. అలాగే సోషల్ మీడియా ద్వారానే మంచి కార్యక్రమాలతో పాటు మంచి విషయాలను కూడా చెప్తారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది.

Read also : అదరగొడుతున్న “టక్ జగదీష్”… 5 మిలియన్ వ్యూస్

“థర్డ్ వేవ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అని ఎవరో నన్ను అడిగారు. మనం ఇప్పటికే థర్డ్ వేవ్ అనుభవిస్తున్నాము. సామాన్యుడిని తాకిన నిరుద్యోగం, పేదరికం థర్డ్ వేవ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ముందుకు వచ్చి నిరుపేదలకు సహాయం చేయండి, ఉపాధి ఇవ్వండి. అదే దీనికి టీకా” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.

Exit mobile version