అదరగొడుతున్న “టక్ జగదీష్”… 5 మిలియన్ వ్యూస్

“టక్ జగదీష్” ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉమ్మడి కుటుంబం నివసించే భూదేవిపురం కథను, తన తండ్రి కోరిక మేరకు భూదేవిపురాన్ని ప్రతీకార రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను టక్ జగదీష్ తీసుకుంటాడని చూపించారు. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ లతో పాటుగా నాని, రీతూ వర్మ మధ్య రొమాన్స్ వంటి అంశాలు కూడా ట్రైలర్‌లో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పాత్రలో నాని, హీరోయిన్ రీతూ వర్మ బాగున్నారు. జగపతి బాబు సోదరుడిగా, డేనియల్ బాలాజీ విలన్ గా కన్పించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది.

Read also : షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత

“టక్ జగదీష్”లో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మిగతా సినిమాల్లాగే ఈ సినిమా కూడా విడుదలను వాయిదా వేసుకుంది. పలు వివాదాల అనంతరం ఈ సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఇక నిన్న నాని తనను ఇండస్ట్రీ వాళ్ళు ఒంటరిని చేశారని, పరిస్థితులు బాగున్నప్పుడు కూడా తన సినిమాలు ఓటిటిలో విడుదలైతే… అప్పుడు తన సినిమాలను ఎవరో బ్యాన్ చేయక్కర్లేదని,తానే స్వయంగా బ్యాన్ చేసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-