బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మృతికి తగిన కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు తెలపకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన సడెన్ గా మృతి చెందడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన బాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించారు. స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్ మరియు 2 స్టేట్స్‌లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది. చివరగా ఆయన మీనాక్షి సుందరేశ్వన్ చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా కనిపించారు. ఇక శివ సుబ్రమణియన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Shiv Subramaniam: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Shiv Subramaniyam