యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ లో అమితాబ్, దీపికాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించిన మేకర్స్ ఈ రెండవ షెడ్యూల్ లో అమితాబ్, ప్రభాస్ పై ముఖ్యమైన సీన్లను షూట్ చేస్తున్నారు. దిగ్గజ నటీనటులు కనిపించబోతున్న ఈ థ్రిల్లర్ మూవీ టెక్నీషియన్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నారు. తాజాగా “ప్రాజెక్ట్ కే” కోసం ఓ బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను మేకర్స్ రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : NBK 107 : మరో పవర్ ఫుల్ టైటిల్… సింహా సెంటిమెంట్ ?
బ్రహ్మస్త్ర, షంషేరా వంటి భారీ చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ ఇప్పుడు “ప్రాజెక్ట్ కే”లోకి ఎంట్రీ ఇచ్చారు. పర్వేజ్ సినిమాలోని ఒక ముఖ్యమైన యాక్షన్ బ్లాక్‌కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు దానికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.