Site icon NTV Telugu

20 ఏళ్లుగా ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నా..

vivek oberoi

vivek oberoi

చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ మూడవ సీజన్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వివేక్ నేపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

” బాలీవుడ్ లో ట్యాలెంట్ ముఖ్యం కాదు ఇంటి పేరు ముఖ్యం.. ఇక్కడ ప్రతిభను ఎవరు చూడరు .. వారి పేరు వెనుక ఇంటిపేరు ఏమున్నదో అదే చూస్తారు.. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది.. ఇప్పటికీ నేను నటుడిగా ఇబ్బంది పడుతూనే ఉన్నాను.. హిందీ చిత్ర పరిశ్రమను ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఉండదు ఇక్కడ.. ఎంతవరకు తమ బంధువులు, తమ వారసులు అనేదే ఉంటుంది.. ఆ ఇంటిపేరు ఉన్న ఎవరైనా వారికి ప్రతిభ ఉండనక్కర్లేదు అని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం వివేక్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో నేపోటిజం గురించి చర్చ జరుగుతున్న తరుణంలో వివేక్ వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయన్నది పలువురి మాట.. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version