Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aashram Season 4: ఓటీటీలో కొన్ని వెబ్‌సిరీస్‌లు వస్తాయి.. కొంతకాలం ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని సిరీస్‌లు మాత్రం వాటి కథ, పాత్రలు, వివాదాస్పద అంశాలతో ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘ఆశ్రమ్’ ఒకటి. 2020లో మొదలైన ఈ సిరీస్ దాదాపు ఆరేళ్లుగా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా కొనసాగుతోంది. మూడు సీజన్లు, మొత్తం 33 ఎపిసోడ్లతో ఇప్పటికే భారీ ఫ్యాన్‌బేస్‌ను సొంతం చేసుకున్న ఈ సిరీస్‌కు నాలుగో సీజన్ కూడా రాబోతోంది.
బాబీ డియోల్ కెరీర్లో ‘ఆశ్రమ్’ ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో హీరోగా ఎన్నో పాత్రలు చేసిన ఆయన.. ఈ వెబ్‌సిరీస్‌లో మాత్రం బాబా నిరాలా అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించారు. ఆ పాత్రను బాబీ డియోల్ పోషించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన నటుడిగా కనిపించిన బాబీ డియోల్‌కు ‘ఆశ్రమ్’ కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకుల్లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
Also Read
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
ప్రకాశ్ ఝా దర్శకత్వంలో రూపొందిన ‘ఆశ్రమ్’ 2020లో MX ప్లేయర్లో స్ట్రీమింగ్ మొదలైంది. తొలి సీజన్‌కే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో వెంటనే రెండో సీజన్‌ను తీసుకొచ్చారు. మొదటి సీజన్ ఆగస్టు 2020లో తొమ్మిది ఎపిసోడ్లతో విడుదల కాగా, అదే ఏడాది నవంబర్‌లో రెండో సీజన్ కూడా తొమ్మిది ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో పెరిగిన ఉత్కంఠ, బాబా నిరాలా పాత్ర చుట్టూ ఏర్పడిన ఆసక్తి కారణంగా సిరీస్‌కు మరింత ఆదరణ లభించింది.
ఆ తర్వాత మూడో సీజన్‌ను రెండు భాగాలుగా విడుదల చేశారు. 2022లో వచ్చిన ‘ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ ఏ’లో పది ఎపిసోడ్లు ఉండగా, ‘పార్ట్ బి’ 2025లో ఐదు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు సీజన్లుగా మొత్తం 33 ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ MX ప్లేయర్లో వీటిని ఉచితంగా చూసే అవకాశం ఉంది.
అయితే మూడో సీజన్‌తో కథ ముగిసిపోయిందని భావించిన ప్రేక్షకులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ‘ఆశ్రమ్ 4’ పనులు మొదలయ్యాయి. నాలుగో సీజన్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు సిరీస్ నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అంటే మరోసారి బాబీ డియోల్ బాబా నిరాలా పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నాలుగో సీజన్లో కథ ఎలాంటి మలుపులు తీసుకోబోతోందనే విషయం మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిని పెంచుతోంది. గత మూడు సీజన్లలో బాబా నిరాలా చుట్టూ తిరిగిన కుట్రలు, నేరాలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత సంబంధాలు కథను ముందుకు నడిపించాయి. ఇప్పుడు నాలుగో సీజన్లో ఈ కథ ఎక్కడికి చేరుకుంటుందనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘ఆశ్రమ్ 4’ కూడా అమెజాన్ MX ప్లేయర్‌లోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆరేళ్లుగా ప్రేక్షకులతో ప్రయాణిస్తున్న ‘ఆశ్రమ్’ నాలుగో సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాబా నిరాలా పాత్రలో బాబీ డియోల్ మరోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
- Tags
- Aashram Season 4
- cinema
తాజావార్తలు
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!