Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Bollywood Star To Play Pivotal Role In Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. నిజానికి.. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ.. పవన్ ఇతర ప్రాజెక్టులతో రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు పవన్ సమయం కేటాయించడంతో.. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా పనుల్ని చకచకా కానిచ్చేస్తున్నాడు. అలాగే.. సినిమాలోని కీలక పాత్రల కోసం పేరుగాంచిన నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. తాజాగా ఓ రాజు పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ఒక స్టార్ నటుడ్ని ఎంపిక చేశాడని సమాచారం. ఇంతకీ ఆ నటుడు ఎవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. బాబీ డియోల్.
సినిమాల పరంగా బాబీ డియోల్ కెరీర్ డౌన్‌ఫాల్ అయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం ఆయన దుమ్ముదులుపుతున్నాడు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ అయితే ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. దాంతో పాటు విభిన్నమైన పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. అందుకే, డైరెక్టర్ క్రిష్ ఏరికోరి మరీ బాబీ డియోల్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడో చిన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకుముందే ఓ కీ-రోల్ కోసం అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. మరి, అతని స్థానంలో బాబీ డియోల్‌ని తీసుకున్నారా? లేకపోతే ఇద్దరూ ఉంటున్నారా? అనేదే అయోమయంగా మారింది. ఎందుకంటే.. డేట్స్ కుదరకపోవడంతో అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో బాబీ డియోల్‌ని దింపారని ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతోంది. మరి, ఇది నిజమో కాదో తేలాలంటే, అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!