Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!

Bobby Deol

Bobby Deol

Bobby Deol: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్‌ను చూస్తే ‘యానిమల్’ కి ముందు.. ఆ తర్వాత అన్నంత రేంజ్‌లో మారింది. నిజానికి ఈ స్టార్ యాక్టర్‌కి యానిమల్ కంటే ముందు సరైన బ్రేక్ లేదు. ఎప్పుడైన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్ హీరోగా తెరకక్కిన యానిమల్ అనే సినిమాతో చాలా కాలం తర్వాత బాబీ డియోల్‌ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్‌ ఆ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుంది. ఈ సినిమా తర్వాత ఆయనకు భాషలకు అతీతంగా వరుసగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే వరుసగా విలన్‌ పాత్రలు వస్తుండటంతో తనపై ఏర్పడిన ఆ ఇమేజ్‌ను బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తాజాగా బాబీ డియోల్‌ తెలిపారు.

తాజాగా ఢిల్లీలో జరిగిన జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాబీ డియోల్ ‘ఆశ్రమ్’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత వరుసగా విలన్ పాత్రలే వస్తుండటంతో, ఆ మూస (స్టీరియోటైప్) ఇమేజ్ నుంచి బయటపడటానికి తాను గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఒక పాత్రలో సక్సెస్ అయితే అతనికి అలాంటి పాత్రలే వస్తాయని, కానీ తాను దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో తాను చేసిన ‘బందర్’ అనే సినిమా ఈ మూస ధోరణికి పూర్తిగా భిన్నమైనదని గుర్తుచేశారు. అలాగే ఇటీవల విడుదలైన ‘ఆల్ఫా’, విజయ్ మూవీ ‘జననాయగన్’లలో విలన్ గానే నటించినప్పటికీ.. ప్రతి నెగటివ్ పాత్రలోనూ వేర్వేరు షేడ్స్ ఉంటాయని, వాటిని కొత్త కోణంలో ప్రెజెంట్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని వెల్లడించారు. తనకు ఓవర్-ది-టాప్ కామెడీ, స్లాప్‌స్టిక్ కామెడీ వంటి జోనర్లు పెద్దగా అర్థం కావని.. అలాంటి సినిమాలు చేయడం తనకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో కోసం సిద్దాంత్ గుప్తా, ఫాతిమా సనా షేక్ లతో కలిసి ‘తీన్ కౌవే’ అనే స్పై డ్రామా వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నట్లు బాబీ డియోల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.