Birthday Girl Trisha Car Collection Details: నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండి 41లోకి ఎంటర్ అయింది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు అనేది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ముందు కుర్ర హీరోలతోనే నటిస్తానని మడి కట్టుకున్న త్రిష తరువాత తత్వం బోధపడి వయసున్న హీరోలతోనూ నటించేసింది. అలా టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్ సరసన నటించి మెప్పించింది త్రిష. ఇక ఆమె పని అయిపొయింది అనుకున్న సమయంలో మణిరత్నం మేగ్నమ్ ఒపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ త్రిష తన అందంతో కనువిందు చేసింది. ఇక ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె కార్ కలెక్షన్ గురించి ఒక లుక్ వేద్దాం.
Monditoka Jaganmohan Rao: ప్రచారంలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్ రావు
1) త్రిషకు బెంజ్ ఎస్ క్లాస్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.80 లక్షలు ఉంటుందని అంచనా.
2) త్రిష కలెక్షన్‌లో బిఎమ్‌డబ్ల్యూ, బెంజ్ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా నటి త్రిషకు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు ఉంది, దీని ధర దాదాపు 75 లక్షలు.
3) త్రిషకు రేంజ్ రోవర్ ఎవోక్ అనే కారు ఉంది. దీని ధర ఒక్కటే దాదాపు 75 లక్షలు ఉంటుంది. త్రిషకు ఇష్టమైన కార్లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు.
4) త్రిషకు బిఎమ్‌డబ్ల్యూ రీస్ అనే ఒక స్పెషల్ కారు కూడా ఉంది. దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు. త్రిషకు చెందిన అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి.