Bipasha Basu: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఏది చేసినా సంచలనంగానే మారుతోంది. వారి పెళ్లి దగ్గర నుంచి పిల్లలు పుట్టేవరకు ఏదైనా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. తమ పెళ్లి వేడుకలను ఓటిటీ లకు అమ్మడం, బేబీ బంప్ షూట్లను మ్యాగజైన్స్ కోసం ఉపయోగించడం చేస్తున్నారు. ముఖయంగా బేబీ బంప్ ఫోటోలను కూడా హాట్ గా చూపించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్, కాజల్, ప్రణీత, నమిత లాంటి హీరోయిన్లు తమ బేబీ బంప్ లతో కనిపించి ఔరా అనిపించారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషా బసు బేబీ బంప్ ఫోటోషూట్ ను షేర్ చేసి షాక్ ఇచ్చింది.
నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను ఐదేళ్ల క్రితం వివాహమాడిన ఈ హాట్ బ్యూటీ ఇన్నాళ్లకు మొదటిసారి తల్లి కాబోతుంది. ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా.. వీటిపై ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. అయితే అనుకోని విధంగా నేడు ఈ కపుల్ తమ బేబీ బంప్ ను పరిచయం చేస్తూ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.అయితే ఆ ఫోటోషూట్ లో కూడా హాట్ నెస్ ను జోడించింది బిపాషా.. వైట్ కలర్ షర్ట్ లో ఒక బటన్ మాత్రం పెట్టుకొనే మిగతాది అంతా వదిలేసి కనిపించింది. ఇక షర్ట్ కింద ప్యాంటు కూడా వేసుకోకుండా బేబీ బంప్ ను కరణ్ చేత్తో పట్టుకొని కనిపించాడు. దీంతో నెటిజన్లు బిపాషా పై మండిపడుతున్నారు. బేబీ బంప్ ను కూడా ఇంత హాట్ గా చూపించాలా..? అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.