Bimbisara:ఈశ్వరుడు చేసిన కొత్త గారడే.. భిక్షుడయ్యే బింబిసారుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సోషియో ఫాంటసీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిగర్తల సామ్రాజ్యపు చక్రవర్తి బింబిసారుడి జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. రాక్షస స్వభావం గల బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ లుక్ అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేసింది.
ఈశ్వరుడే అంటూ సాగిన ఈ గీతం బింబిసారుని స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. “భువిపై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే.. ఈశ్వరుడు చేసిన కొత్త గారడే.. భిక్షుడయ్యే బింబిసారుడే” అంటూ సాగిన లిరిక్స్ ఎంతో అర్థమవంతంగా ఉన్నాయి. ఇక ఈ సాంగ్ కు చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చగా.. కాల భైరవ తన బేస్ వాయిస్ తో ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్నేళ్ల నుంచి విజయం కోసం పరితపిస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా గట్టి విజయాన్ని అందించేలా ఉందని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకొని ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
Also Read
- Peddi: 'పెద్ది' సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
- Janhvi Kapoor: 'స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు'.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
- Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. 'పెద్ది' డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
- PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
తాజావార్తలు
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!