Kiara Advani: కత్రినా కైఫ్ ‘షీలా కీ జవానీ’, కరీనా కపూర్ ‘హల్కత్ జవానీ’, దీపికా పదుకొనే ‘లవ్లీ’ చిత్రాలలో చార్ట్‌బస్టర్ సాంగ్స్ తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ చేరనుంది. ‘గోవింద నామ్ మేరా’లో ‘బిజిలీ’ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించటం ఖాయం అంటున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన డ్యాన్స్ నంబర్‌లు చాలా ఉన్నప్పటికీ ఐకానిక్ చార్ట్‌బస్టర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వడం అనేది తక్కువ సందర్భాలలో మాత్రమే జరుగుతూ వచ్చింది. కత్రినా కైఫ్ – షీలా కీ జవానీ ‘తీస్ మార్ ఖాన్’లో కత్రినా కైఫ్ ‘షీలా కీ జవానీ’ అంటూ తన కెరీర్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాటలో చిందేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, ఈ పాట మాత్రం దశాబ్దం తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాలలో చెక్కుచెదరని స్థానాన్ని పొందింది.
Read also: Dowry Harassment: వద్దన్నా వదల్లేదు.. కత్తితో గొంతు కోసి చంపి గోనెసంచిలో పెట్టి..
కరీనా కపూర్- హల్కత్ జవానీ ఇక ‘హీరోయిన్’ సినిమాలో కరీనా కపూర్ అవార్డ్ షోలో భాగంగా ‘హల్కత్ జవానీ’ అనే పాటలో కనిపించింది. ఈ పాట ఇప్పటికీ ఫుట్-ట్యాపింగ్ నంబర్ గా డ్యాన్స్ ట్రాక్స్ లో అన్ని పార్టీలలో కనపడుతూనే ఉంది. దీపికా పదుకొణె- లవ్లీ అలాగే షారూక్ ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో దీపికా పదుకొణె సెక్సీ అవతార్‌లో చిందేసిన ‘మై లవ్లీ హూ..’ పాట తనలోని డాన్సింగ్ స్కిల్స్ ని పరిచయం చేసింది. దీపిక హిట్ సాంగ్స్ ఈ పాట ముందు వరసలో ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘గోవింద నామ్ మేరా’లొ కియారా అద్వాని బిజిలీ పాట సోషల్ మీడియాలో కోలాహలం సృష్టిస్తోంది. ఇందులో కొరియోగ్రాఫర్‌గా నటిస్తూ కియారా అద్వానీ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో ఆకట్టుకుంటోంది. దాంతో పూర్తి పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కత్రినా, దీపిక, కరీనా సూపర్ హిట్ పాటల సరసన తను నటించిన బిజిలీ పాట కూడా చోటు దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని కియారా వ్యక్తం చేస్తోంది. మరి అమ్మడి ఆశ ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
Chiru Vs Balayya: ఇద్దరు మాస్ హీరోలని మేనేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్
