Site icon NTV Telugu

Biggboss OTT: ఛీ ఛీ ఇంత నీచమా.. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్న వర్మ హీరోయిన్లు

biggboss

biggboss

బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో అషూ, అరియనా చెప్పులతో కొట్టుకున్నారు.

ఇక దీనికి హార్ట్ అయిన అరియనా.. చెప్పుతో కొట్టడం ఏమి బాగాలేదని అషూపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు అషూ సైతం నువ్వు చేసిన పనికి నేను అలా చేయాల్సివచ్చిందంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు ఈ కొత్త గొడవ అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ చుసిన ప్రేక్షకులు సైతం ఛీ ఛీ ఏంటి ఈ దారుణం.. ఈ చెప్పులతో కొట్టుకోవడమేంటి.. రోజురోజుకు ఈ షో లో వైలెన్స్ ఎక్కువైపోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇదంతా వర్మ ట్రైనింగ్ యే కదా.. ఇద్దరు వర్మ బ్యూటీలే కదా.. ఎక్కడా తగ్గరు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version