Site icon NTV Telugu

Bigg Boss 9 : వైల్డ్ కార్డు ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు.. ఇక రచ్చ రచ్చే..

Bigg Boss 9

Bigg Boss 9

Bigg Boss 9 : తెలుగు బిగ్ బాస్ సీజన్-9కు ఎంత చేసినా పెద్దగా క్రేజ్ రావట్లేదు. ఏదో చప్ప చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా అయితే బిగ్ బాస్ కు కుదరదు కదా.. ఎప్పుడూ రచ్చ రచ్చగా సాగితేనే బిగ్ బాస్ షోకు అందం అని దాన్ని చూసే వాళ్లు అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లతో పెద్దగా క్రేజ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు కాంట్రవర్సీ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ద్వారా ఈ ఆదివారం దివ్వెల మాధురి, రమ్యమోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్), నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌, ఆయేషా, శ్రీనివాస్‌ సాయి హౌస్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వీరందరూ కూడా కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్ గానే ఉన్నారు. దివ్వెల మాధురి పేరు ఏపీ రాజకీయాల్లో ఏ స్థాయిలో కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే.

Read Also : Anjan Kumar Yadav: పార్టీలో నేను చాలా సీనియర్.. టికెట్ ఇస్తే గెలిచే వాణ్ణి..

సోషల్ మీడియాలో ఆమె పేరు కనిపిస్తేనే చాలు నానా రచ్చ జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో సంచలనం అయిన రమ్య మోక్షకు కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్ అయినా.. హౌస్ లో నానా రచ్చ చేసి ఎంటర్ టైన్ చేస్తుందనే ఉద్దేశంతో తీసుకువస్తున్నారు. ఇక ఆయేషా తమిళనాట పెద్ద కాంట్రవర్సీ పేరు ఆమెది. ఆమె తమిళనాడు బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా కమల్ హాసన్ మీదకే ఎదురు తిరిగి హాట్ టాపిక్ అయింది. అక్కడ ఆమె పేరు అప్పట్లో పెద్ద సంచలనం. ఇలాంటి వారిని తీసుకొచ్చి బిగ్ బాస్ లో నానా రచ్చ చేయడం ఖాయం అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి వీరు వచ్చాక హౌస్ ఎలా మారిపోతుందో చూడాలి.

Read Also : Vemulawada Temple: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూలు..

Exit mobile version