Site icon NTV Telugu

Akhil: ఎట్టకేలకు బ్రేకప్ పై నోరువిప్పిన అఖిల్

Akhil

Akhil

బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది.  ప్రతి ఒక్కరు తమ బ్రేకప్‌ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్‌ కూడా బ్రేకప్‌ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను ఆమెను అలాగే పిలిచేవాడిని. ఇద్దరం పక్క పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. అయితే పెరిగేకొద్దీ మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఒకరోజు మా ఇంటి పక్కన ఉన్న సందులోకి పిలిచి తను నాకు లవ్ లెటర్ ఇచ్చింది. అది రక్తంతో రాసిందని తన చేతికి ఉన్న గాయాలను బట్టి తెలుసుకున్నాను. నాకోసం రక్తంతో లవ్ లెటర్ రాసిందని నేను కూడా ప్రేమలో పడిపోయాను. చాలా కాలం మేం ప్రేమలో ఉన్నాం. ఆమె ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ నాలుగేళ్లు కూడా మనం ఇలానే ఉంటే.. మనది నిజమైన లవ్‌ అని చెప్పా.. ఆ ఆతరువాత ఆమె లాస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు నేను షూటింగ్ లతో బిజీగా మారాను. కొన్నిసార్లు తన ఫోన్ ని లిఫ్ట్ చేసేవాడిని కాదు. కొద్దిగా బ్రేక్ దొరికినా తనకే కాల్ చేశావాడిని.

ఒకరోజు తనకు కాల్ చేస్తే బిజీ వచ్చింది. చాలాసార్లు ట్రై చేశా.. బిజీ అని వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్‌ చేసి ఎవరితో మాట్లాడుతున్నావ్‌ అని అడిగాను. డాడీతో మాట్లాడిన అని అబద్దం చెప్పింది. ఇల్లు దగ్గరే కదా హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లి మాట్లాడొచ్చుగా అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని సీరియస్ అయ్యింది. అదే మాటను అడ్డుగా పెట్టుకొని నాకు బ్రేకప్ చెప్పింది. మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు.. మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని ఆరేళ్ల తరువాత బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత నేను డిఫ్రెషన్ లోకి వెళ్లాను. బ్రేకప్‌కి ముందే ఆమె  ఓ కెనడా అబ్బాయితో రిలేషన్‌లో ఉంది అని ఫ్రెండ్ చెప్పడంతో నాకు నేను ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగాను. ఇది జరిగిన తొమ్మిది నెలల తరువాత ఒకరోజు ఆమె కనిపించి.. కర్మ అంటే ఇదే .. నేను నిన్ను ఎలా వదిలేశానో .. అతడు కూడా నన్ను అలా వదిలేశాడు అని చెప్పి ఏడ్చింది. ఆ తరువాత ప్రేమపై నమ్మకం పోయింది. కానీ ఫస్ట్‌ లవ్‌ మ్యాజిక్‌ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఈ బ్రేకప్ నన్ను నేను స్ట్రాంగ్ గా మలచుకోవడానికి దోహదపడింది” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version