Site icon NTV Telugu

పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ బ్యూటీ.. అతడు నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

maria juliana

maria juliana

కమలహాసన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి జూలీ అమింజికరై అలియాస్‌ మరియా జులియానా,. గతంలో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఫేమస్ అయిన ఈ భామ ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొని అందరికి దగ్గరయింది. ఇక తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, తనవద్ద ఉన్న డబ్బులు, నగలు తీసుకొని ప్రియుడు ఉడాయించాడని తెలుపుతూ తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అన్నా నగర్ కు చెందిన మనీష్ అనే యువకుడితో జులియానా నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు, ఆమెకు మాయమాటలు చెప్పి, ఆమెవద్ద ఉన్న నగలు, డబ్బు తీసుకొని పరారయ్యాడు.. కొన్నిరోజులు అతడి కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తన ప్రియుడు తనను మోసం చేసి డబ్బు, నగలు తీసుకొని పారిపోయాడని, తనను ఎలాగైనా వెతికి పట్టుకొని తన వస్తువులను తిరిగి ఇప్పించాలని ఆమె కోరింది. జూలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version