Site icon NTV Telugu

Bigg Boss 9 : ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లో మజా డబుల్ అవుతుందా?

Kavya

Kavya

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది.

Also Read : Jennifer Lopez’s: తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే?

ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. గత సీజన్‌ (BB8)లో మెహబూబ్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్‌లు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను రెట్టింపు చేశారు. ముఖ్యంగా రోహిణి, అవినాష్‌ల అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గౌతమ్ కృష్ణ, అవినాష్‌లు చివరి వరకు హౌస్‌లో నిలవగా, చివరికి నిఖిల్ మలియాక్కల్ విజేతగా నిలిచాడు. ఇలాంటి విజయవంతమైన స్ట్రాటజీ కారణంగానే ఈసారి కూడా బిగ్‌బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అందులో మొదటి పేరు బుల్లితెర నటి కావ్య అలియాస్ దీపిక రంగరాజు (బ్రహ్మముడి ఫేమ్). తమిళనాడుకు చెందిన ఈ అల్లరి పిల్ల ప్రస్తుతం టెలివిజన్‌లో, సీరియల్స్‌లో, బుల్లితెర కార్యక్రమాల్లో తన చలాకీతనంతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది.

కావ్య తెలుగు అంత బాగా రాకపోయినా, తాను మాట్లాడే స్టైల్‌తో ఫన్ జనరేట్ చేస్తుంది. అందుకే “వాగుడుకాయ” అని అనిపించినా, కంటెంట్ ఉందని పలువురు మెచ్చుకున్నారు. గత సీజన్‌లో గెస్ట్‌గా హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌కు ఉత్సాహం నింపిన ఆమె, తాను ఎప్పట్నుంచో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉండాలని కలగంటున్నట్లు బహిరంగంగానే చెప్పింది. అయితే సెప్టెంబర్ 7న విడుదలైన అధికారిక లిస్ట్‌లో కావ్య కనిపించలేదు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా త్వరలోనే హౌస్‌లో అడుగుపెడుతుందని టాక్. నిర్వాహకులు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్, టీఆర్పీ రేటింగ్స్‌ను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా 4 నుంచి 6 వారాల మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం అలవాటు. అందుకే ఈసారి కావ్య ఎంట్రీ కన్ఫర్మ్ అయితే, హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు.

Exit mobile version