బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss సీజన్ 9 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం 8 సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు 9వ సీజన్ మరింత ఎంటర్‌టైన్‌మెంట్, టెన్షన్, డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు, అలాగే ఈ సీజన్‌లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ తో మరింత ప్రత్యేకంగా, టఫ్‌గా ప్లాన్ చేశారు.
Also Read : Yellamma : నితిన్, శర్వానంద్ కాదు.. బరిలోకి కొత్త హీరో?
‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులు ఎంపిక చేసి ఓటింగ్ ప్రక్రియలో ఉంచారు. వీరిలో 5 మంది మాత్రమే ఫైనల్‌గా హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. మరి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారో గ్రాండ్ లాంచ్ వరకు సస్పెన్స్. ఇక వీరితో పాటు టాలీవుడ్, బుల్లితెర నుంచి పలువురు స్టార్ కంటెస్టెంట్స్ ఈసారి హౌస్‌లో అడుగు పెడుతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో లో బిగ్ బాస్ సీజన్9 ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఇది బిగ్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఈ కామన్ పీపుల్స్‌తో పాటుగా రాబోయే సెలబ్రేటిల ఎవ్వరనది పక్కన పెడితే. ప్రోమో లో ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్ అంటూ కింగ్ నాగ్ చెప్పిన డైలాగ్ మరింత ఉత్సాహాని నింపేసింది.. మరి ఎంత వరకు ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.