NTV Telugu Site icon

Big Breaking: ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చరణ్ రావడం లేదట

Charan

Charan

Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్ నేడు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే భారీ వర్షం కారణంగా.. ఈ ఈవెంట్ కొద్దిగా ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావడం లేదని సమాచారం.

Ramya Krishnan: శివగామి రమ్యకృష్ణ కొడుకును చూశారా.. త్వరలో హీరో అయిపోయేలా ఉన్నాడు

ఇక ఆయన తప్ప చిత్ర బృందం మొత్తం ఈ వేడుకలో పాలు పంచుకోనున్నది. అయితే ఇప్పటివరకు ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అమృతం పోసినట్లు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ ఈవెంట్ కు బాబాయ్ రాకపోయినా అబ్బాయ్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వస్తున్నాడని, సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను బాబాయ్ ప్లేస్ లో అబ్బాయ్ అందుకున్నాడని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన చరణ్ రాలేకపోతున్నాడట. ఆయన ప్రస్తుతం ముంబైలోనే ఉండిపోయారని సమాచారం అందుతుంది. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Show comments