సీనియర్ నటి భూమిక షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ చిట్టి పొట్టి బట్టలు ధరించి, గ్లామర్ లుక్ లో కన్పిస్తోంది. అయితే ఆ పిక్ ఇప్పటిది కాదట. అసలు ఆ పిక్ ఎప్పుడు తిసిందో తనకు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది భూమిక. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటూ భూమిక బ్యూటీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ పిక్ మరో కొత్త అనుమానానికి తెర తీసింది. కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన ఈ అమ్మడు గ్లామర్ ను ఒలకపోయాడానికి సిద్దమైందా ? అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Acharya : ఆగిన సినిమా… అభిమానుల ఆందోళన
వాస్తవానికి భూమిక అనగానే పదహారణాల తెలుగమ్మాయి కళ్ళముందు కదలాడుతుంది. నిన్నటితరం స్టార్ హీరోలందరితోనూ ఆమె కొన్ని గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నది మాత్రం భూమిక సాంప్రదాయ పాత్రలే. ఇక తాజాగా పోస్ట్ చేసిన పిక్ లో ఒలకబోసినంత గ్లామర్ గా భూమిక ఏ సినిమాలోనూ కన్పించలేదు. దీంతో భూమిక గ్లామర్ ఓవర్ డోస్ అన్పించే రోల్స్ కూడా చేయాలనుకుందా ? అనే డౌట్ వస్తోంది. ఏది ఏమైనా ఈ భామ చేసిన సినిమాలు, అందులో చాలా పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె అభిమానులకు ఎవర్ గ్రీన్.