మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చాడు. మెగా తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కన్పించనుంది. మరి ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు రిలీజ్ అయితే, ఆ స్క్రీనింగ్ లో అంతరాయం ఏర్పడితే మెగా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? థియేటర్ ను పీకి పందిరేయరూ ! తాజాగా అనంతపురంలో అదే జరిగింది.
Read Also : Acharya Movie Twitter Review : టాక్ ఏంటంటే?
అనంతపురంలోని ఎస్వీ థియేటర్ లో ఈ ఉదయం ‘ఆచార్య’ షో వేయగా, సాంకేతిక సమస్యతో సినిమా రెండు సార్లు ఆగిపోయిందట. అది కూడా రెండు సార్లు 10 నిమిషాల పాటు సినిమాని నిలిపివేశారట థియేటర్ యాజమాన్యం. ఇంకేముంది ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న బాస్ మూవీ మధ్యలో ఆగడంతో మెగాస్టార్ ఫాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో థియేటర్లో ఆందోళన చేశారట అభిమానులు. ఇక ‘ఆచార్య’ విషయానికొస్తే మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా సినిమా ఉందంటూ టాక్ నడుస్తోంది.