టాలివుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి వయస్సు పెరిగిన క్రేజ్ తగ్గలేదు.. వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘ భోళా శంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది.. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. అందులో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు హాజరయ్యారు..
ఈ సినిమాలో నటించిన నటీనటులు మాత్రమే కాదు.. టాలివుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.. హరీష్ శంకర్, బాబీ, వంశీ పైడి పల్లి, సంపత్ నంది, గోపీచంద్ మలినేని, బుచ్చి బాబు తదితరులు హాజరైయారు..అలాగే ప్రముఖ నిర్మాతలు కూడా హాజరవ్వడం విశేషం.. ఈవెంట్ లో ప్రతి ఒక్కరు చిరంజీవి గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్పీచ్ లతో స్టేజ్ మొత్తం దద్దరిల్లింది.. మెగా ఫ్యాన్స్ కేకలతో ఈవెంట్ మొత్తం సందడిగా సాగింది..
ఇక ఈ ఈవెంట్ కు హైపర్ ఆది స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. డైరెక్టర్ మెహర్ రమేష్, అలాగే చిరంజీవి మాటలు సినిమాపై హైప్ ను క్రియేట్ చేసాయి.. ఈ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా ముగించారు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఈ సినిమాలో చిరంజీవి లుక్ స్టైలిష్ గా ఉంటుందని పోస్టర్స్ చూస్తేనే తెలిసిపోతుంది.. తెలంగాణ యాసలో అదరగోట్టారు.. సినిమా విడుదల అవ్వక ముందే మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది..