Amrita Pandey: నటి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhojpuri Actress Amrita Pandey Was Partying Two Days Before Her Death: భోజ్‌పురి నటి అమృతా పాండే అనుమానాస్పద మృతిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో, ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం అమృత డిప్రెషన్‌తో బాధపడుతోంది లేదా కలత చెందిందనే వాదన తప్పు అని రుజువు చేసేలా ఉంది. ఆమె మరణానికి రెండు రోజుల ముందు, ఆమె తన భర్త, తన స్నేహితుల బృందంతో భారీగా పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో అమృత చాలా డ్యాన్స్ చేసింది. ఆ పార్టీ జరిగిన 48 గంటల తర్వాత తన జీవితాన్ని ముగించుకోవాలని ఎందుకు అనుకుంది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి అమృతపాండే మరణవార్త విని అందరూ ఉలిక్కిపడ్డారు. ఆమె యానిమేషన్ రంగంలో పనిచేసే తన భర్త చంద్రమణి ఝంగాడ్తో కలిసి ముంబైలో నివసించేది. అమృత తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు ఏప్రిల్ 12న బీహార్ వచ్చింది.
Poonam Kaur: వాళ్ళకి వోట్లు వేయొద్దంటూ వేడుకుంటున్న పూనమ్, సంచలన వీడియో రిలీజ్!
Also Read
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
- Janta Movie: మెగా హీరో 'జంట' సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
చంద్రమణి కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆ వివాహం తరువాత, చంద్రమణి ఏప్రిల్ 18 న ముంబైకి తిరిగి రాగా అమృత భాగల్పూర్ వెళ్ళింది. ఇకఏప్రిల్ 25న అమృత పార్టీ చేస్తున్నప్పుడు, చంద్రమణి ఆమెతో ఉండటం కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది, ఎందుకంటే అతను 18వ తేదీనే ముంబై తిరిగి వచ్చాడు. ఏప్రిల్ 27న అమృత సోషల్ మీడియాలో ‘అతని జీవితం రెండు పడవలపై ఉంది, మేము మా పడవను ముంచడం ద్వారా అతని మార్గాన్ని సులభతరం చేశాము’ అని ఒక పోస్ట్ రాసింది. ఆ తరువాత, ఆమె మృతదేహం ఫ్లాట్‌లో వేలాడుతూ కనిపించింది. ఇప్పుడు బయటకు వచ్చిన కొత్త మీడియా కథనాలలో, ఆ పార్టీలో అమృత కూడా తన భర్తతో కలిసి డ్యాన్స్ చేసిందని అంటున్నారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు కనిపించలేదు, అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా వారి బంధంలో ఎలాంటి విభేదాలు రాలేదు. అమృత తన ఇద్దరు సోదరీమణులు, ఆమె దత్తత తీసుకున్న సోదరుడితో ఏదో ఒక సమస్యపై వివాదం ఉందని ఒక షాకింగ్ నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి చాలా వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక అమృత ముంబైలో తన సోదరి కుమార్తెను పెంచుతోంది.
తాజావార్తలు
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Modi-Trump Meeting in Manila: మోడీతో ట్రంప్ కీలక భేటీ.. మనీలాలో క్వాడ్ సమ్మిట్‌లో ఏం జరగబోతోంది?
-
Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!