సంపత్ నంది డైరెక్షన్‌లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ మూవీ ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాస్ యాక్షన్, కమర్షియల్ హంగులతో ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ సినిమాలో వయలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. టీజర్‌లోనే భారీ పోరాట సన్నివేశాలను చూపించిన దర్శకుడు, ట్రైలర్‌లో అంతకు మించిన రక్తపాతాన్ని సృష్టించాడు…
బొగ్గుల గుట్టలో ఏం జరుగుతుంది?
ఒక సినిమా కోసం బ్యాక్ డ్రాప్‌ను సెట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ అది పర్ఫెక్ట్‌గా సెట్ అయితే 30% సినిమా అక్కడే సక్సెస్‌ను సాధిస్తుంది. గతంలో ‘రంగస్థలం’ మూవీ విషయంలో ఇది ప్రూవ్ అయింది. ఆ ఊరులోని మనుషులను, వాళ్ళ మనస్తత్వాలను బాగా రాసుకున్నారు. అందుకే అది గొప్ప విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి మేకర్స్ అందరూ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లను సెట్ చేసి సినిమాలు చేస్తున్నారు. అందులో భోగి మూవీ కూడా ఒకటి కావడం విశేషం.
ఈ మూవీ ట్రైలర్‌ను బట్టి ఈ మూవీ కథ ఏంటో తెలుసుకుందాం…బొగ్గుల గుట్ట ఊరు మొత్తం దొర చెప్పుచేతల్లోనే ఉంటుంది. ఆయనని ఎవరు ఎదిరించినా వాళ్ళకి చావు తప్పదు అనే విషయాన్ని ట్రైలర్‌లో చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఊరులో ప్రతి నెల అమావాస్య రోజున ఊరులో దిష్టి పూజ అయిపోయాక, “మా అన్నతో పాటు మీరు కనిపించకుండా పోతున్నారు, ఏం చేస్తున్నాయి మీ చేతులు” అంటూ హీరో చెప్పే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్ అవ్వడమే కాకుండా, డైరెక్టర్ కథలో ఏదో సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. ఇక ట్రైలర్‌లో ఒక షాట్‌లో తలలు లేని మొండాలు కనిపించాయి. అంటే ప్రతి అమావాస్య రోజున ఏవో మర్డర్లు జరుగుతున్నాయి. తలలను నరికేసి వాటిని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు… వాటితో ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? అనే విషయాన్ని హీరో ఎలా పట్టుకున్నాడనేది సినిమా చూసే తెలుసుకోవాలి.
ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో హీరో తనకి ఇష్టమైన వాళ్ళను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన చెల్లెలంటే ప్రాణంగా బతికే భోగి, వాళ్ళకి వచ్చిన ఒక కష్టాన్ని ఎలా తీర్చాడు? అసలు అమావాస్య రోజు జరిగే ఆ మర్డర్‌కి, ఈ ఊరు దొరకి మధ్య సంబంధం ఏంటి? హీరో వాళ్ళను పట్టుకోవడానికి ఏం చేశాడనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. నిజానికి సంపత్ నంది గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ఆయన ఎక్కువగా కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. కథలో వైవిధ్యాన్ని చూపిస్తూనే మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే సంపత్ నందికి మరోసారి స్టార్ హీరోల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది.

