వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే ఇందులో ఏదో ఒక సినిమాను వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతల సమావేశం కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఈ సినిమాల నిర్మాతలూ భేటీ అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆ సమావేశం సాధారణంగానే ముగిసింది. అయితే ఇందులో ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయాలంటూ నిర్మాతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలన్నింటినీ మేకర్స్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు తగ్గేదే లే అన్నట్టుగా ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేయడం సినిమాపై మరోమారు ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
Read Also : దుబాయ్ లో అల్లు ప్రిన్సెస్ బర్త్ డే వేడుకలు… పిక్స్ వైరల్
“భీమ్లా నాయక్” నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ లో పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో నుండి పవన్ కళ్యాణ్ లుక్ ను చూస్తూ 2022 జనవరి 12న షెడ్యూల్ ప్రకారం “భీమ్లా నాయక్” థియేటర్లలోకి వస్తాడని యువ నిర్మాత అభిమానులకు హామీ ఇచ్చారు. ఆ పిక్ చూస్తుంటే పోటీకి సిద్ధం అంటూ ‘భీమ్లా నాయక్’ చెప్తున్నట్టుగా ఉంది. “పదం గుర్తుంచుకో! ఈసారి కూడా మిస్ అవ్వదు… థియేటర్లలో కలుద్దాం… 2022 జనవరి 12” అని ట్వీట్ చేసాడు వంశీ. దీంతో మరోసారి “భీమ్లా నాయక్” వాయిదాపై వచ్చిన ఊహాగానాలన్నిటినీ తిప్పికొట్టాడు. ఏదేమైనా సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో మేకర్స్ లేరని స్పష్టం అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, స్టిల్స్‌కు అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.