దుబాయ్ లో అల్లు ప్రిన్సెస్ బర్త్ డే వేడుకలు… పిక్స్ వైరల్

నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు. అల్లు ప్రిన్సెస్ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి చాలా ఆడంబరంగా జరుపుకుంది. బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అల్లు అయాన్, కూతురు అర్హ, అల్లు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ ఆనందకరమైన సందర్భాన్ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును దుబాయ్ ఐకానిక్ నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాలో అత్యున్నత స్థాయిలో జరుపుకోవడానికి విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశాడు. బుర్జ్ ఖలీఫాలో సాధారణ ప్రజలు ఏవైనా సెలెబ్రేషన్స్ చేసుకోవాలంటే దాదాపు అసాధ్యం. అయితే స్టైలిష్ స్టార్ అర్హా పుట్టినరోజు సందర్భంగా భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అర్హ ఇక్కడ జరుపుకున్న మొదటి పార్టీ ఇదే. అంతేకాదు మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ జరిగిన మొదటి వేడుక కూడా ఇదే.

Read Also : కైకాల సత్యనారాయణ లేటెస్ట్ హెల్త్ అప్డేట్

అల్లు అర్జున్ ట్విట్టర్‌ వేదికగా కూతురుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్హాతో ఉన్న బ్యూటిఫుల్ పిక్ పంచుకున్నారు. “హ్యాపీ బర్త్‌డే మై లిల్ ప్రిన్సెస్. నేను చాలా ప్రేమిస్తున్నాను బేబీ. ఈ సంవత్సరం చాలా కలరింగ్, డ్రాయింగ్ & ట్రావెలింగ్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను” అని బన్నీ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం దుబాయ్ లో అర్హ పుట్టినరోజుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

Image
Image
Image
Image

Related Articles

Latest Articles