క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక యంగ్ హీరో అఖిల్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”లోనూ నటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కానుంది. ఇలా చేతి నిండా సినిమాలతో స్టార్ డమ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది పూజ హెగ్డే. ప్రస్తుతం ఆమె ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల గురించి ఎదురు చూస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు

ఇక సినిమాల సంగతి ఇలా ఉంటే రోజురోజుకు ఆమెకున్న క్రేజ్ కూడా భారీగానే పెరిగిపోతోంది. తాజాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్ లో రెడ్ రోస్ తో ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్లను కితకితలు పెడుతున్నాయి. ఆ పిక్ ను పూజా హెగ్డే షేర్ చేసిన కొన్ని గంటల్లోనే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Image
Image
Image
-Advertisement-క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

Related Articles

Latest Articles