కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమ కళలాడుతోంది. మునెప్పడూ లేని విధంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే జనవరి 7 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు ముందుగానే తప్పుకొని వేరొక డేట్ ని ప్రకటించేశాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి 12 న ‘భీమ్లా నాయక్’, జనవరి 14 న ‘రాధే శ్యామ్’. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే మేము తగ్గేది లేదంటూ ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపినా.. ఇటీవల దీపావళి కానుకగా విడుదల చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో మరోసారి ఈ అనుమానాలు రేకెత్తాయి. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి జక్కన్న ప్లాన్ చేయడంతో ‘భీమ్లా నాయక్’ మేకర్స్ కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారని, వేరొక డేట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. మరి ఈ వార్తలే కనుక నిజమైతే.. సంక్రాంతి బరిలో నుంచి ‘భీమ్లా నాయక్’ కూడా తప్పుకున్నట్లే..
