Bharateeyans: నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఇది. “ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” చిత్రాల రచయిత దీన్ రాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “మా బ్యానర్ లో సూపర్ హిట్ సినిమాలు ‘ప్రేమించకుందాం రా, కలిసుందాం రా’కు దీన్ రాజ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నాను. దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ, “దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. శంకర్ గారు అమెరికాలో డాక్టర్. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. హీరోలలో ఒకరైన నీరోజ్ మాట్లాడుతూ “హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్” అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు జూడో రాము యాక్షన్ కొరియోగ్రాఫర్ కాగా సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.