DMF Awards : భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 హైదరాబాద్ లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ ను సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించింది. ఇందులో కంటెంట్ క్రియేటర్స్, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు, కొందరు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ గెస్ట్ గా I&PR ప్రత్యేక కమిషనర్ ప్రియాంక పాల్గొని అవార్డులు అందజేశారు. డిజిటల్ క్రియేటర్స్ నేటి రోజుల్లో చాలా అవసరం అన్నారు. వారందరికీ స్పెషల్ విషెస్ తెలిపారు. బాలీవుడ్ స్టార్ తరణ్ ఆదర్శ్ డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – ఫిల్మ్ జర్నలిజం అవార్డు అందుకున్నారు. ఆయన మాట్లాడూతూ “ఈ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉంది. డిజిటల్ క్రియేషన్స్ లో మార్పు కోసం చాలా ట్రై చేశా. ఈ అవార్డు రావడం వల్ల నా కష్టానికి ప్రతిఫలం దక్కింది’ అన్నారు.
Read Also : JIGRIS : జిగ్రీస్ మూవీ నుంచి మీరేలే సాంగ్ రిలీజ్..
ఇక తెలుగు స్టార్ యాంకర్ సుమ కనకాలకు డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది. ఆమె మాట్లాడుతూ “ఈ అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. డిజటల్ రంగంలో ఎంత డెవలప్ అయినా సరే.. ప్రేక్షకులతో మనకున్న కనెక్షన్ ఇంకా పెరిగింది అని చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ పాపరాజో మానవ్ మంగ్లానీ డిజిటల్ ఐకాన్ – విజువల్ ఇన్‌ఫ్లుయెన్స్ అవార్డును అందుకున్నారు. ‘ఇది నాకు మాత్రమే కాదు, డిజిటల్ పాపరాజ్జీ కమ్యూనిటీకి దక్కిన గౌరవంగా తెలిపారు.
రా టాక్స్ వంశీ కూరపాటి పాడ్ కాస్టింగ్ కు గాను ‘డిజిటల్ ఐకాన్ – పాడ్‌కాస్టింగ్ & యూత్ వాయిస్ అవార్డు’ అందుకున్నారు. ‘ఈ అవార్డు నా లాంటి కంటెంట్ క్రియేటర్స్ కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. స్థానిక భాషను, ఎమోషన్స్ ను ప్రజలతో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది’ అన్నాడు. రాబోయేదంతా డిజిటల్ యుగమే అన్నారు. ఈవెంట్ కు భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకుడు విశ్వ సీఎం అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ‘DMF ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాలు, భాషలు మరియు ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ క్రియేటర్స్ ను ప్రోత్సహించడం, వారందరినీ వెలుగులోకి తీసుకువస్తాం అని తెలిపారు. ప్రముఖ యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలు, టెక్ భాగస్వాములు హాజరయ్యారు.
Read Also : Allu Arjun : క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు బన్నీ బర్త్ డే విషెస్
