NTV Telugu Site icon

Bhama Kalapam 2: మోస్ట్ డేంజరస్ లేడీ మళ్లీ వస్తుంది..

Bhama

Bhama

Bhama Kalapam 2:ఆహా ఓటిటీ ప్రస్తుతం నంబర్ 1 స్థానాన్ని అందుకోవడానికి బాగా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద ఓటిటీలతో సమానంగా పోటీపడుతూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. కొత్త షోస్, మూవీస్, వెబ్ ఒరిజినల్స్ తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఇక ఆహా నుంచి వచ్చిన వైవిధ్యమైన సినిమాల్లో భామా కలాపం ఒకటి. విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఒక అపార్ట్మెంట్ లో కుటుంబంతో కలిసి ఉండే ఒక మహిళ.. తన వంట ప్రావీణ్యాన్ని యూట్యూబ్ లో చూపించి డబ్బులు సంపాదించాలనుకుంటుంది. ఆ నేపథ్యంలోనే అనుకోకుండా ఒక హత్య చేస్తుంది. చివరికీ దాన్ని నుంచి ఎలా బయటపడింది అనేది.. భామా కలాపంలో చూపించారు. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా భామా కలాపం 2 ను త్వరలోనే మన ముందుకు తీసుకు వస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ ఫ్రాంచైజీ రూపొందుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ప్రేక్షకులను ఆకట్టుకుకునేలా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Barrelakka: బిగ్ బాస్ లోకి బర్రెలక్క.. కారు గిఫ్ట్.. ?

అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియమణి.. వ్యాక్యూమ్ క్లినర్ ను పట్టుకొని నిలబడగా .. పక్కన రక్తంతో తడిసిన సూట్ కేస్, వెనుక బ్లాస్ట్ అవుతున్న ఇల్లు, తుపాకులు కనిపించాయి. డ్రీమ్ ఫార్మర్స్‌తొో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్ లో విడుదల కానుంది. ప్రస్తుతం వచ్చే సినిమాలు.. థియేటర్ లో రిలీజ్ అయ్యాకే.. ఓటిటీలోకి రావాలని కండీషన్ ఉండడంతో.. ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ది మోస్ట్ డేంజరస్ లేడీ ఈసారి ఎలాంటి క్రైమ్ చేస్తుందో చూడాలి.