NTR : ఎన్టీఆర్-కొరటాల.. అదిరిపోయే ట్యూన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యంగ్ టాలెంట్ ఏం చేసినా.. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా.. సెన్సేషనల్‌గా నిలుస్తుంది. పైగా ఆచార్యతో డీలా పడిపోయిన కొరటాల.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టేందుకు కసిగా ఉన్నాడు. అందుకే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్-కొరటాల శివ.. మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎన్నో మాస్ బీట్స్‌తో రచ్చ లేపిన అనిరుధ్.. ఈ సారి ఎన్టీఆర్ కోసం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ మాస్ బీట్ ఎలా ఉండబోతోంది..?
Also Read
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
‘మిర్చి’ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు కొరటాల శివ. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే రీసెంట్గా వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు. కారణాలు ఏమైనా.. ఒకే ఒక్క ప్లాప్‌తో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు కొరటాల. దాంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో ఫ్లాఫ్ మచ్చను తుడిచుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. తనదైన మార్క్‌తో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ బిగ్ అప్టేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం కొత్త టీమ్‌తో ముందుకెళ్తున్నాడు కొరటాల. వారిలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఉన్నాడు. ఇంతకు ముందు కొరటాల సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేశారు. అయితే ‘ఆచార్య’ చిత్రానికి మాత్రం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను తీసుకున్నారు. ఇదే ఆచార్యకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. అందుకే ఈ సారి అనిరుధ్‌ని రంగంలోకి దింపాడు. దాంతో ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట అనిరుధ్. అభిమానులు కూడా అతను అద్బుతమైన మాస్ బీట్స్ ను ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే.. తమిళ్లో అనిరుధ్‌కు భారీ క్రేజ్ ఉంది. అక్కడ అతని పాటలు ఓ రేంజ్లో సెన్సేషనల్‌గా నిలిచాయి. రీసెంట్గా వచ్చిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్ దుమ్ము దులిపేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా.. ఓ అదిరిపోయే మాస్ బీట్ రెడీ చేస్తున్నాడట అనిరుధ్. దాంతో నందమూరి అభిమానులకు థియేటర్లో పూనకాలే అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!