బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై కేసు నమోదు అయ్యింది. ఆమెకు ఈ కేసులో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే… గొలుసులతో కట్టేసి ఉన్న ముంగిసతో స్రబంతి ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో ఆమెపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ముంగిసతో ఉన్న ఆమె ఫోటోలు చూసిన అటవీ అధికారులు ఫిబ్రవరి 15న నోటీసు పంపారు. నేరం రుజువైతే స్రబంతికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Read Also : Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని 9, 11, 39, 48A, 49, 49ఏ సెక్షన్ల కింద స్రబంతి ఛటర్జీపై కేసు నమోదు చేశారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్‌మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతిని కోరింది. ఆమె ఈ నెల ప్రారంభంలో సోషల్ మీడియాలో గొలుసు ముంగిసతో ఉన్న చిత్రాలను పంచుకుంది. ఈ సంఘటనపై శ్రబానీ ఛటర్జీ స్పందిస్తూ “కేసు విచారణలో ఉంది కాబట్టి నేను ఏమీ వ్యాఖ్యానించలేను” అని తెలిపింది. ఆమె లాయర్ మాట్లాడుతూ అసలు ఖచ్చితమైన ఆరోపణలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటామని అన్నారు.