NTV Telugu Site icon

Robinhood : డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ కు ప్లస్సా.. మైనస్సా..?

Robinhood

Robinhood

ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్‌ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్‌ ప్రచారాన్ని హీరో డైరెక్టర్‌ నితిన్‌, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్‌ రాలేదు. భీష్మ వంటి హిట్‌ తర్వాత నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌ రిపీట్ అవతున్నా మొదట్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ కనిపించలేదు. టీజర్ సాంగ్స్‌ ఆకట్టుకున్నా స్టూడెంట్స్‌ ఎగ్జామ్స్‌ ఐపిఎల్‌ సీజన్‌ మొదలుకావడంతో రాబిన్‌హుడ్‌కు రావాల్సినంత హైప్‌ రాలేదనే చెప్పాలి.

Also Read : MadSquare : ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ రిలీజ్.. ఫన్ అన్ లిమిటెడ్..

ప్రమోషన్స్‌ విషయంలో అనిల్‌ రావిపూడి నుంచి ఇన్‌స్పైర్‌ అయిన వెంకీ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ వీడియోస్‌తో వచ్చాడు. అయితే ఇవేవీ జనాల్లోకి తీసుకెళ్లలేకపోయినా డేవిడ్‌ వార్నర్‌తో చేసిన వీడియో మాత్రం దూసుకెళ్లింది. సినిమాలో గెస్ట్‌ అపీరియన్స్‌ ఇస్తున్న డేవిడ్‌ వార్నర్‌ రాకతో. రాబిన్‌హుడ్‌కు కొత్త కళ వచ్చింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఇది మొదలుకాగా నితిన్‌, శ్రీలీల కలిసి డేవిడ్‌కు తెలుగు నేర్పే వీడియో సరదాగా ఆకట్టుకుంది. గత ఏడాది ఇదే టైంలో ఐపిఎల్‌తో బిజీగా వున్న డేవిడ్‌ వార్నర్‌ ఈసారి ఒకవైపు ఐపిఎల్ మ్యాచెస్‌ జరుగుతుంటే ఈ ఆస్ట్రేలియన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మేన్‌ మాత్రం రాబిన్‌హుడ్‌ ప్రమోషన్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడోగానీ ప్రమోషన్స్‌కు ఎక్కువ టైమే కేటాయించాడు. ఆస్ట్రేలియన్‌ మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ యాక్టింగ్‌ స్టార్ట్‌ చేశాడు. అప్పుడప్పుడు రీల్స్‌ చేస్తూ.. డబ్‌ స్మాష్‌లు చేస్తూ గడిపేసే వార్నర్‌ తెలుగు సినిమాతో వెండితెరకు ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు. ఆమధ్య రాజమౌళితో కలిసి చేసిన యాడ్‌లో రకరకాల గెటప్స్‌తో కామెడీ చేశాడు. మరి రాబిన్‌హుడ్‌ యాక్టింగ్‌ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి మరి.