Pan India: నెక్స్ట్ వెయ్యి కోట్ల సినిమా సలార్ కాదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కంప్లీట్ రన్ లో 650-700 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు టచ్ చేయడం అనేది కష్టమైన పని. ఇలాంటి సమయంలో నెక్స్ట్ వెయ్యి కోట్లు రాబట్టే సినిమా ఏది అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క మాట సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న సలార్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకే నెక్స్ట్ వెయ్యి కోట్ల బొమ్మ ఏది అనగానే పాన్ ఇండియా ఆడియన్స్ టక్ మని సలార్ అనేస్తున్నారు. సలార్ సినిమా కన్నా సరిగ్గా రెండు వారాల ముందు ఇంకో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది.
ఈ మూవీకి కూడా వెయ్యి కోట్లని రాబట్టే సత్తా ఉంది. కోలీవుడ్ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. జవాన్ పై భారీ అంచనాలున్నాయి. పైగా పటాన్‌తో వెయ్యి కోట్లు కొల్లగొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ప్రస్తుతం జవాన్ సినిమాపై ఉన్న అంచనాలని బట్టి పఠాన్ సినిమా కలెక్షన్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ కూడా కలిస్తే జవాన్ సినిమా వెయ్యి కోట్లకిపైగానే రాబడుతుందని త్రాగే వర్గాలు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నార్త్ ఆడియన్స్ కి చాలా బాగా తెలుసు. ఈసారి అది పాన్ ఇండియా ఆడియన్స్ అంతా తెలుసుకోబోతున్నారు. సో జవాన్ సినిమాతో పఠాన్ రికార్డులని తిరగరాసి.. సలార్ కంటే ముందే షారుఖ్ వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!