కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. ఫుల్ ఛిల్ల్ మోడ్ లో విజయ్ , పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.
