Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవ, మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కులాగా ఆయన్ను చూస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలోని నటీనటులు, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు చిరుకు అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. ఇక బండ్ల గణేశ్ మెగా అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు వీరాభిమాని అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఇక తాజాగా బండ్ల తన ఇంట్లోనే దీపావళి పార్టీ ఇచ్చాడు. దీనికి సినీ పెద్దలు చాలా మంది వచ్చారు.
Read Also : Samantha : డైరెక్టర్లు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు.. సమంత షాకింగ్ కామెంట్స్
మైత్రీమూవీ మేకర్స్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ లాంటి వారు వచ్చేశారు. చిరంజీవి ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఇక చిరు, శ్రీకాంత్ ఒకే కారులో దిగారు. చిరు కారు నుంచి దిగగానే బండ్ల గణేశ్ వెళ్లి కాళ్లకు నమస్కరించాడు. అనంతరం చిరు చేతులు పట్టుకుని ఇంట్లోకి ఆప్యాయంగా తీసుకెళ్లాడు. చిరు కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన చైర్ లో కూర్చోబెట్టి అభిమానం చాటుకున్నాడు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు అంటే బండ్ల అంటే అంతటి అభిమానం అంటున్నారు ప్రేక్షకులు.
Read Also : Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
