Bandla Ganesh: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన బండ్ల గణేష్.. కారణం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh Says Good Bye To Politics: గడిచిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఎంత హంగామా చేశాడో అందరూ చూశారు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తమ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అప్పట్లో ఆయన ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూ, చేసిన ప్రతీ స్టేట్మెంట్ హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీనే డామినేట్ చేసేంత లెవెల్లో.. అప్పట్లో బండ్ల గణేష్ రచ్చ చేశాడు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు బండ్ల. అప్పట్నుంచే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టాడు.
ఇప్పుడు తాను పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నానని బండ్ల గణేష్ ట్విటర్ మాధ్యమంగా ప్రకటించాడు. ‘‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల, నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. అంటే.. ఇకపై రాజకీయాల్లో బండ్ల ఎంటర్టైన్మెంట్ ఉండదన్నమాట!
Also Read
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
- Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
- Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి... కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
- AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల... 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
తాజావార్తలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!