Parakramam: ఆ కల్ట్ సినిమాల డైరెక్టర్ నుంచి పరాక్రమం.. టీజర్ అదిరిందంతే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Saroj Kumar Parakramam Teaser launched: బిఎస్ కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తయింది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞాన సాగర్ ద్వారక, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో, నిర్మాత బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చా, చాలా మంది డైరెక్టర్స్ కు ఆడిషన్స్ ఇచ్చా, వారికి నా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్లు డైలాగ్స్ చెబుతున్నావ్ అనేవారు. నాకు ఇక్కడ సూట్ కాదని అర్థమైంది. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే కావాలనుకుని దర్శకుడిగా మారా. నేను ప్రొడ్యూసర్స్ ను పట్టుకోవాలంటే అసాధారణ ప్రతిభావంతుడైన ఉండాలి, ఈ క్రమంలో ఒక 20 ఏళ్ల పాటు రెగ్యులర్ లైఫ్ కు దూరంగా ఉండిపోయా, నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి.
Music Shop Murthy: వెనక్కి వెళ్లిన చాందినీ చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కళ నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో ఆ సినిమాలను ఉంచా, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు తోచినంత డబ్బులు సపోర్ట్ చేశారు. నేను మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలని, సకుటుంబంగా ఆ సినిమాలను చూడాలని నా సినిమాలను ఇష్టపడేవారు కోరుకున్నా, వారందరి సపోర్ట్ తో ఎంకరేజ్ మెంట్ తో పరాక్రమం సినిమా చేశా. నేను ఇండస్ట్రీలో ఎక్కువగా తిరగను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతా కాబట్టి ఎక్కువ మందికి నేను నచ్చను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్కేఎన్, బుచ్చిబాబు, విశ్వక్ సేన్ ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం సంతోషంగా ఉంది. పరాక్రమం సినిమా కోసం ఒక యజ్ఞం చేశాం, పరాక్రమం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. అందుకే నా బ్యానర్ కు బీఎస్ కే మెయిన్ స్ట్రీమ్ అని పేరు పెట్టానన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!