Site icon NTV Telugu

Nagarjuna : అలై బలైకు రండి.. నాగార్జునకు దత్తాత్రేయ ఆహ్వానం..

Nagarjuna

Nagarjuna

Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ.

Read Also : OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే

ఇక నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే కుబేర, కూలీ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో మెప్పించారు. కూలీ సినిమాలో నాగ్ చేసిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తాను మెయిన్ హీరోగా వస్తున్న సినిమాలపై నాగ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తన వందో సినిమా ప్రాజెక్టు గురించి కూడా కీలక చర్చలు మొదలైనట్టు ప్రచారం అయితే నడుస్తోంది. మరి దీనికి నాగ్ ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతున్నాడనేది మాత్రం తెలియాల్సి ఉంది. చూడాలి మరి నాగ్ అలై బలై ప్రోగ్రామ్ కు వస్తాడా లేదా అనేది.

Read Also : OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..

Exit mobile version