Allu Arjun: బన్నీని అభినందించిన బండారు దత్తాత్రేయ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు .. దేశమంతటా మారుమ్రోగిపోతుంది. నేషనల్ అవార్డ్ అందుకోని టాలీవుడ్ సత్తాను చూపించాడు. ఇక పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డ్ రావడంతో బన్నీ అభిమానులతో పాటు దేశం మొత్తం మీద ఉన్న సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అవార్డు వచ్చిన వెంటనే.. బన్నీ ఇండస్ట్రీ మొత్తానికి పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బన్నీని సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి.. బన్నీని శాలువా తో సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. తాజాగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ.. బన్నీని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేడు.. హైదరాబాద్ వచ్చిన దత్తాత్రేయ.. నేరుగా బన్నీ ఇంటికి వెళ్లి కలిశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలిచినందుకు బన్నీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇక ఇదే విషయాన్నీ బండారు దత్తాత్రేయ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Pushpa The Rule : ఈ సారి సినిమాలో మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్న సుకుమార్..?
Also Read
” ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ గారితో ఆహ్లదకరమైన సమావేశం బాగా జరిగింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో. ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించినందుకు అభినందనలు తెలపడం జరిగింది. ఆయన భవిష్యత్తుకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని తెలిపారు. ఇక ఈ ట్వీట్ కు స్పందించిన బన్నీ.. ” ధన్యవాదాలు బండారు దత్తాత్రేయ గారు.. మీరు పర్సనల్ గా ఇంటికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
Had a pleasant meeting with prominent film personality Shri @alluarjun Garu in Hyderabad at his residence today. Congratulated him on achieving the prestigious National Best Actor Award. Best wishes for the future. pic.twitter.com/mxsMBDAO5h
— Bandaru Dattatreya (@Dattatreya) August 28, 2023
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!