NBK109: అన్‌స్టాపబుల్.. అతనితో మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్‌లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే! మరి, ఆ తర్వాత సంగతులేంటి? ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే, అవుననే ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. ఆ సినిమా మరెవ్వరితోనో కాదు.. రచయితగా తనదైన ముద్ర వేసిన బీవీఎస్ రవి.
అసలు వీరి కాంబో ఎలా కుదిరిందనేగా మీ సందేహం? బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమాన్ని డిజైన్ చేసిందే బీవీఎస్ రవి. ఆ పరిచయంతోనే అతనికి బాలయ్య ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఆ షో సమయంలోనే బీవీఎస్ రవి ఒక స్టోరీలైన్ వినిపించగా, అది బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట! దాంతో ఆ పనులు ప్రారంభించిన బీవీఎస్ రవి.. పూర్తి కథని సిద్ధం చేసి ఇటీవల బాలయ్యకి వినిపించాడట! తన ఇమేజ్‌కి తగినట్టుగానే స్టోరీని రెడీ చేయడంతో.. బాలయ్య సంతృప్తి చెంది, బీవీఎస్ రవితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకి పని చేసిన బీవీఎస్ రవి.. దర్శకుడిగా తీసిన వాంటెడ్, జవాన్ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
Also Read
కాగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య చేస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు, అనిల్ రావిపూడితో చేయనున్న సినిమా కూడా డిఫరెంట్ జోనర్లో తెరకెక్కనుందట! తండ్రి, కూతురు మధ్య చుట్టూ అల్లుకుని ఉండే ఈ సినిమాలో బాలయ్య సరికొత్త క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్నట్టు స్వయంగా అనిల్ రావిపూడినే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కామెడీ జోనర్‌కి భిన్నంగా తాను ఈ సినిమా తీస్తున్నానని కూడా చెప్పాడు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!