Site icon NTV Telugu

NBK108: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనల్లో అనిల్?

Balakrishna Rejects Anil Ra

Balakrishna Rejects Anil Ra

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి.

ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ ఈ సినిమాకి ‘బ్రో ఐ డోన్ట్ కేర్’ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు ఈ టైటిల్ ఖరారైందనే వార్తలూ చక్కర్లు కొట్టాయి. స్క్రిప్ట్ డిమాండ్, బాలయ్య ఇమేజ్‌కి ఈ టైటిల్ సరిగ్గా సూటవుతుందని భావించి, అదే ఫిక్స్ చేయాలని అనిల్ డిసైడ్ అయ్యాడట! అయితే.. తాజా సమాచారం ప్రకారం బాలయ్యకు ఆ టైటిల్ నచ్చలేదట! టైటిల్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ, తెలుగుదనం లేదన్న భావనతో మార్చాలని ఆయన సూచించారట! దీంతో.. అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడితే బాగుంటుందా? అనే ఆలోచనల్లో పడినట్టు తెలుస్తోంది. ఒకసారి టైటిల్ ఫిక్స్ అయ్యాక, దాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య చేస్తోన్న NBK107 షూటింగ్ ముగిశాక కొంత గ్యాప్ తీసుకొని, NBK108కి పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కథానాయిక పాత్ర కోసం ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు. ప్రియమణి పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఇంకా కన్ఫమ్ అవ్వలేదు. మరి, మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

Exit mobile version