Balayya :మరోసారి ఆ హీరోయిన్ తో నటించబోతున్న బాలయ్య…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా వున్నాడు.. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా దసరాకు విడుదల కాబోతుంది.ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు.. ఇక తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసారు.టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.. ఈ మూవీలో హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం.ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ లో నెలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని సమాచారం.నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది..దేవిశ్రీ సంగీతం అందించనున్నారు. అయితే ఈసినిమాలో హీరోయిన్గా బాలయ్య సరసన నయనతార నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమెను మూవీ టీమ్ సంప్రదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో సింహా, జై సింహా, శ్రీరామ రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మరీ ఈ సినిమాలో నయనతార కన్ఫర్మ్ అయినట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బాలయ్య అఖండ సినిమాకు ముందు తీసుకున్న రెమ్యూనరేషన్ 10 కోట్ల వరకు ఉండేది.అయితే దాన్ని ఇప్పుడు బాగా పెంచినట్లు సమాచారం.. బాలయ్య రెమ్యూనిరేషన్ తీసుకునే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఓ సినిమా ఒప్పుకునే ముందు ఏదో కొంత మొత్తం అనుకుంటారని సమాచారం.. అయితే ఈ సినిమా విడుదల అయిన తరువాత సినిమా టాక్ బాగోలేకపోతే ఆ రెమ్యూనరేషన్‌ను తగ్గించడం కూడా జరుగుతుందని సమాచారం.. ఆ విధంగా బాలయ్య నిర్మాతల మంచి కోరతారు బాలయ్య.
Also Read
తాజావార్తలు
-
China Floods: భారత్‌లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!