NTV Telugu Site icon

Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య

Nag

Nag

Nandamuri Balakrishna: సాధారణంగా ఒక వివాదం వచ్చినప్పుడు సెలబ్రిటీలు కానీ, రాజకీయ నేతలు కానీ ఏం చేస్తారు.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే చూస్తారు. అందుకు తగ్గట్టు మాట్లాడి సెట్ చేస్తారు. కానీ, ఇక్కడ కూడా బాలయ్య స్టైల్ వేరు. ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు మరో వివాదానికి తెరలేపుతాడు. ఒక వివాదం ముగిసిందో లేదో మరో వివాదం మొదలయ్యింది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ మాట తూలడం.. అది కాస్తా వైరల్ గా మారి అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్ళింది. అక్కినేని వారసులు అఖిల్, నాగ చైతన్య సైతం ఈ విషయమై స్పందించారు. బాలయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేయడం కూడా జరిగింది.

Read Also: R Sridhar : అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

ఇక తాజాగా ఈ వివాదంపై మొట్ట మొదటిసారి బాలయ్య స్పందించాడు. “ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ రెండు కళ్లలాంటివారు.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను.. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు.. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను” చెప్పుకొచ్చాడు.

Read Also: MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే

ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత ” నేను అంటే ఆయనకు చాలా ఇష్టం.. సొంత పిల్లలు కంటే ఎక్కువగా నన్నే చూసుకొనేవారు. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారు.. ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క మాట మారారు కొత్త చర్చకు దారితీసింది. సొంత పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అంటే అక్కినేని నాగార్జున కుటుంబం ఏఎన్నార్ ను పట్టించుకోలేదా..? సరిగ్గా చూసుకోలేదా..? బాలయ్య అన్న మాటలకు అర్ధం ఏంటి..? అంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఒక వివాదం ముగిసిపోయింది అనుకుంటే బాలయ్య మరోసారి మాట తూలి ఇంకో వివాదం తీసుకొచ్చాడే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments